అంతరిక్షం టీజర్ విడుదల తేదీ ఖరారయిందా ?

అంతరిక్షం టీజర్ విడుదల తేదీ ఖరారయిందా ?

Published on Oct 15, 2018 1:06 PM IST

మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్నస్పెస్ థ్రిల్లర్ ‘అంతరిక్షం 9000కెఎమ్ పిహెచ్’ ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను జరుపుకుంటుంది. ఇక ఈ చిత్రం గురించి తాజాగా ఓక అప్డేట్ అందుతుంది. చిత్ర వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం యొక్క టీజర్ ను అక్టోబర్ 17న విడుదలచేయనున్నారట. అయితే ఈవిషయాన్ని అధికారికంగా ద్రువీకరించాల్సి వుంది.’ఘాజీ’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి తెరకెక్కిస్తున్నఈచిత్రంలో లావణ్య త్రిపాఠి, అదితి రావ్ హైదరి కథానాయికలుగా నటిస్తున్నారు.

ఫస్ట్ ఫ్రేం ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రంలో వరుణ్ వ్యోమగామి పాత్రలో కనిపించనున్నాడు. ఈచిత్రం డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు