ఆగష్టు 15న రానున్న వర్మ – విష్ణుల ‘అనుక్షణం’

ఆగష్టు 15న రానున్న వర్మ – విష్ణుల ‘అనుక్షణం’

Published on Aug 5, 2014 7:55 PM IST

anukshanam

ప్రస్తుతం హిట్స్ లేదా ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో, తన సినిమాల విషయంలో పలు వివాదాలు క్రియేట్ చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేసే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. రామ్ గోపాల్ వర్మ మంచు విష్ణు హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమాకి ఇటీవలే ‘అనుక్షణం’ అనే టైటిల్ ని ఖరారు చేసారు.

ఈ రోజు ఈ సినిమాలోని టైటిల్ సాంగ్ లాంచ్ హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ సినిమాని ఆగష్టు 15న రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ‘అమ్మాయిలూ జాగ్రత్త’ అనేది ఈ సినిమాకి ఉపశీర్షిక. అమ్మాయిలపై జరుగుతున్న అత్యాచారాలపై జరుగుతున్న పాయింట్ ని తీసుకొని సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మంచు విష్ణు సరసన తేజస్వి నటిస్తుండగా, మధు శాలిని ఓ జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుంది. చాలా రోజుల తర్వాత సీనియర్ నటి రేవతి ఈ సినిమా ద్వారా తెలుగులో కనిపించనుంది.

తాజా వార్తలు