తన హెల్త్ ఇష్యూలపై క్లారిటీ ఇచ్చిన అనుపమ పరమేశ్వరన్!

Published on Jul 12, 2018 10:49 am IST

క్రేజీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ రెండు రోజుల క్రితం రామ్ తో కలిసి నటిస్తున్న హలో గురు ప్రేమకోసమే షూటింగ్ లో అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం ఇప్పటికే సోషల్ మీడియాలో ఆమెకు ఏమైంది, ఏదైనా సీరియస్ హెల్త్ ప్రాబ్లం వుందా అంటూ పలు రకరకాల కథనాలు వస్తున్న నేపథ్యంలో అనుపమ నేడు మీడియా కి తన హెల్త్ విషయమై క్లారిటీ ఇచ్చారు. నా హెల్త్ పై వస్తున్న రూమర్లు చూసి నేను నవ్వుకున్నాను, నేను వాస్తవానికి మొన్న షూటింగ్ లో పాల్గొంటున్నపుడు, ప్రకాష్ రాజ్ గారితో కలిసి చేసే సీన్ లో డైలాగులు చెపుతున్నపుడు, అనుకున్నంత బాగా సరైన సమయానికి చెప్పలేక తడపడ్డాను.

అయితే వెంటనే ప్రకాష్ రాజ్ గారు డైలాగులు మరొకసారి చెప్పమని, మరొక టేక్ చేద్దాం అన్నారు. కాగా అప్పటికే తనకు ఉదయం నుండి కొద్దిగా జ్వరంగా, మరియు బిపి కూడా లో గా ఉండడంతో షూటింగ్ లో చాలా ఇబ్బందిపడడాన్ని గమనించిన యూనిట్ సభ్యులు ఆ తరువాత తనను హాస్పిటల్ కు తీసుకెళ్లారని, డాక్టర్లు పరీక్షించి మెడిసిన్ ఇచ్చారని, అంతే తప్ప తన ఆరోగ్యానికి సంబంధించి పెద్ద ప్రమాదమేమీ లేదని చెప్పుకొచ్చింది….

సంబంధిత సమాచారం :