యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కోసం ఇటీవల కొన్ని ఇంట్రెస్టింగ్ వార్తలే సోషల్ మీడియాలో సినీ వర్గాల్లో వినిపిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆమెకి ఓ ప్రముఖ యువ హీరోతో బ్రేకప్ అయ్యింది అంటూ పలు వెర్షన్ లు వినిపించాయి. ఇక ఈ సమయంలోనే అనుపమ తన బ్రేకప్ స్టోరీ రివీల్ చేసింది. తను ఒక టాక్సిక్ రిలేషన్ షిప్ లో ఉన్నానని చెప్పి షాకించ్చింది.
తన ఎక్స్ లవర్ ఒక అపరిచితుడు లా షేడ్స్ చూపించాడు అని చెప్పడం వైరల్ గా మారింది. అతను తనని సినిమా ప్రమోషన్స్ కి కూడా వెళ్ళనివ్వలేదు అని, పైగా తమ రిలేషన్ షిప్ మొదలైన 3 నెలలకే వారి ఇంట్లో పెళ్లి కోసం చర్చలు కూడా చేసేసారని ఆమె రివీల్ చేయడంతో ఇప్పుడు ఆ అపరిచితుడు ఎవరు అనే టాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో మొదలైంది.


