తన అందాలతో కుర్రకారు మతిని పోగొట్టిన అందాల భామ అనుష్క రజినికాంత్ సరసన ‘లింగ’ సినిమాలో అదిరిపోయే పాత్రలో నటించింది
ఈ సినిమాపై ఒక వర్గం సినీ పండితులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నా అనుష్క మాత్రం చిత్ర విజయంపై నమ్మకం వ్యక్తం చేసింది. అంతేకాక ఈ సినిమా తన కెరీర్ లోనే పెద్ద హిట్ గా నిలుస్తుందనడం విశేషం. భారతదేశం గర్వించదగ్గ నటులలో ఒకరైన సూపర్ స్టార్ రజిని సరసన తాను నటించడం తన అదృష్టమని తెలిపింది
ఈ సినిమాలో అనుష్క తో పాటూ సోనాక్షి సిన్హా మరో హీరోయిన్. మరి అనుష్క సినిమా పై చూపించిన నమ్మకం ఎంత మేరకు విజయం సాధిస్తుందో మరి కొన్ని గంటల్లో తేలుతుంది .


