పెళ్లి పుకార్లతో విసుగెత్తిపోయిన అనుష్క

పెళ్లి పుకార్లతో విసుగెత్తిపోయిన అనుష్క

Published on Oct 5, 2014 10:32 PM IST

anushka
దాదాపు సౌత్ ఇండియన్ స్టార్ హీరోలందరితోనూ నటించి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటించి యోగ బ్యూటీ అనుష్క స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. అనుష్క ప్రస్తుతం ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్ లో మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్స్ లో హీరోయిన్ గా నటిస్తోంది. తన కెరీర్లో తీరిక లేకుండా గడుపుతున్నా తనకు విసుగు రాలేదు కానీ మీడియాలో వస్తున్న పుకార్ల విషయంలో మాత్రం తనకి బాగా విసుగొచ్చిందని అంటోంది.

విషయం ఏమిటంటే.. అనుష్క పెళ్లి విషయంపై ఇప్పటికి చాలా సార్లు పలు వదంతులు వినిపించాయి. కానీ చాలా సార్లు అనుష్క వాటిని ఖండించి, ఆ వార్తల్లో నిజం లేదని తెలిపింది. అయినా కానీ ఇదే వార్తలు వస్తూనే ఉన్నాయి. ‘ఎవరు కనపడినా పెళ్ళెప్పుడు అని అడుగుతుంటే సమాధానం ఇచ్చి ఇచ్చి విసుగొచ్చేసింది. నాకు తప్ప అందరికీ నా పెళ్లి గురించే కంగారు. నేను చెప్పే వరకూ ఆగచ్చు కదా ఈ లోపే పుకార్లు పుట్టించేస్తున్నారని’ అనుష్క బాధ పడుతోంది.

అనుష్క ప్రస్తుతం తెలుగులో ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ సినిమాల్లో నటిస్తోంది. అలాగే తమిళంలో లింగ, అజిత్ సరసన ఓ సినిమా చేస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు