
తెలుగు, తమిళ భాషల్లో దర్శకులు క్రీజీ కమర్షియల్ సినిమాలు చేయడానికి ట్రై చేస్తుంటే.. తమిళ డైరెక్టర్ బాల మాత్రం ప్రతి సారి ఓ రియలిస్టిక్ హార్డ్ హిట్టింగ్ పాయింట్ తో ప్రేక్షకులను మెప్పించడానికి ప్రయత్నిస్తుంటాడు. అలా వచ్చిన ప్రేక్షకులను మెప్పించిన సినిమాలే శివ పుత్రుడు, నేను దేవుణ్ణి మరియు వాడు – వీడు. బాల నుంచి రానున్న లేటెస్ట్ తమిళ్ మూవీ ‘తారై తప్పట్టై’. ఇటీవలే షూట్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈ సినిమా షూట్ ఫినిష్ చేయగానే బాల ఓ భారీ బడ్జెట్ రియలిస్టిక్ మూవీకి శ్రీకారం చుట్టాడు.
భారీ బడ్జెట్ మాత్రమే కాదు భారీ మల్టీ స్టారర్ తారగానతో ఈ సినిమాని తెరకెక్కించడానికి సిద్దమయ్యాడు. ఇప్పటికే హీరోలుగా ఆర్య, విశాల్, రానా, అరవింద్ స్వామి, అధర్వలను సెలక్ట్ చేసాడని తెలియజేశాం. తాజాగా ఈ సినిమాకి కీలకమైన హీరోయిన్ పాత్ర కోసం అనుష్కని సంప్రదిస్తున్నారు. బాల చెప్పిన కథ విని నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్ర కావడంతో అనుష్క కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కోలీవుడ్ వర్గాలు ఖరారు చేస్తున్నాయి. ఈ లెక్కన 5 మంది హీరోలు ఉన్న సినిమాలో అనుష్క ఒక్కటే మెయిన్ హీరోయిన్ గా కనిపించనుండడం విశేషం. అన్ని పనులను పూర్తి చేసి సంక్రాంతి తర్వాత ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.

