ఈ ఏడాది ఇప్పటికే బాహుబలి సినిమాలో టోటల్ డిఫరెంట్ లుక్ లో ప్రేక్షకులను మెప్పించిన హాట్ బ్యూటీ అనుష్క ఈ ఏడాది మరో రెండు డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అవే రుద్రమదేవి, సైజ్ జీరో. రుద్రమదేవిలో ఒక రాణిగా మునుపెన్నడూ చూడని గేప్ లో కనిపించనుంటే, ‘సైజ్ జీరో’లో అనుష్క బాగా లావుగా బొద్దుగా ఉన్న లుక్ లో కనిపించనుంది. ఈ సినిమా పోస్టర్స్ ద్వారా రిలీజ్ చేసిన అనుష్క లుక్ అందరినీ షాక్ అయ్యేలా చేస్తే, ఫస్ట్ టీజర్ మాత్రం అందరినీ బాగా ఎంటర్టైన్ చేసింది. ఈ సినిమా కోసం అనుష్క అమాంతం 20 కేజీల బరువు పెరిగి ఈ సినిమాని చేసింది.
కానీ ఈ సినిమా టీజర్, కొన్ని పోస్టర్స్ రిలీజ్ అయ్యాక కొంతమంది ఏమో అనుష్క నిజంగా లావు అవ్వలేదని, ప్రోస్తేటిక్స్ వాడి అనుష్కని లావుగా చూపించారనే వార్తలు వస్తున్నాయి. అనుష్క ఈ వార్తలను కొట్టి పారేసింది. ‘నేను లావుగా కనిపిస్తున్న లుక్ ఫేక్ కాదు. ఆ సినిమాకోసం నేను కార్బోహైడ్రేట్స్ తీసుకొని లావు అయ్యానని’ అనుష్క తెలిపింది. ఈ రోజు హైదరాబాద్ లోజరగాల్సిన ఆడియో రిలీజ్ ని వాయిదా వేసారు. త్వరలోనే ఈ మూవీ న్యూ ఆడియో రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారు. ప్రకాష్ కోవెల మూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనుష్కతో పాటు ఆర్య, సోనాల్ చౌహాన్ లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పివిపి బ్యానర్ పై ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాకి ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందించాడు.


