తమిళ హీరో శింబు తో ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ ‘విన్నాయ్ తాండి వరువాయి’ చిత్రానికి సీక్వెల్ ను తెరెక్కించనున్నారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా సాగె చిత్రం లో శింబు కి జోడిగా అనుష్కను తీసుకోవాలనుకుంటున్నారట గౌతమ్ మీనన్.
మరి శింబు తో నటించడానికి అనుష్క అంగీకరిస్తుందో లేదో చూడాలి. ప్రస్తుతం గౌతమ్ మీనన్, ధనుష్ తో ‘ఎన్నై నొక్కి పాయం తోట’ అలాగే చియాన్ విక్రమ్ తో ‘ధ్రువ నట్చత్తిరమ్’ చిత్రాలను తెరకెక్కిస్తున్నాడు. ఈరెండు చిత్రాలను పూర్తి చేసిన తరువాత శింబు చిత్రాన్ని మొదలుపెట్టనున్నారు.


