అనుష్క కొత్త ప్రాజెక్ట్ త్వరలోనే ఉంటుందా ?

Published on Jun 4, 2021 7:09 pm IST

స్టార్ హీరోయిన్ అనుష్క సినిమాల స్పీడ్ బాగా తగ్గించారు. ‘భాగమతి’ తరవాత చాన్నాళ్లకి ‘నిశ్శబ్దం’ చేసిన ఆమె ఇంకా కొత్త సినిమాను అనౌన్స్ చేయలేదు. యువీ క్రియేషన్స్ సంస్థతో ఆమె ఒక సినిమాకి సైన్ చేశారు. ఇందులో నవీన్ పొలిశెట్టి కీలక పాత్ర చేయనున్నాడు. ఇదే అనుష్కకు తదుపరి చిత్రం. సినిమా ప్రీప్రొడక్షన్ దశలో ఉంది. అన్నీ సిద్ధంగా ఉన్నా అనుష్క నుండి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో షూటింగ్ మొదలుకాలేదు. ఈలోగా కరోనా సెకండ్ వేవ్ మొదలైంది. షూటింగ్స్ అన్నీ ఆగిపోయాయి.

దీంతో చిత్రం మరోసారి సందిగ్ధంలో పడినట్లయింది. కానీ ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు ఈ చిత్రం జూన్ నెలాఖరు నుండి మొదలయ్యే సూచనలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రీప్రొడక్షన్ దాదాపు పూర్తికావడం, అనుష్క కూడ ఆసక్తి చూపడంతో షూటింగ్ సన్నాహల్లో ఉన్నారట నిర్మాతలు. ఈ ప్రాజెక్ట్ మీద ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి ఉంది. నవీన్, అనుష్కలది కొత్త కాంబినేషన్ కాబట్టి సినిమా ఎలా ఉండబోతోందో చూడాలని అనుకుంటున్నారు చాలామంది. సినిమాకు ఇద్దరి పేర్లు కలిసొచ్చేలా ‘మిస్. శెట్టి.. మిస్టర్.. పోలిశెట్టి’ అనే టైటిల్ నిర్ణయించినట్టు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :