బాహుబలి ఫస్ట్‌పార్ట్‌లో అనుష్కది చిన్న పార్ట్!

బాహుబలి ఫస్ట్‌పార్ట్‌లో అనుష్కది చిన్న పార్ట్!

Published on May 5, 2015 9:27 PM IST

anushka1 (1)
దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చారిత్రక చిత్రం ‘బాహుబలి’. ఈ సినిమాపై అంతటా ఎంతటి క్రేజ్ ఉందో తెలిసిందే. ఎలాగూ ఈ సినిమా విడుదల ఇప్పట్లో లేకపోవడంతో సినిమాపై ఉన్న క్రేజ్‌ను మరింత పెంచడానికి బాహుబలి టీమ్ కొత్త ప్లాన్ వేసింది. మే 31న ‘బాహుబలి’ మొదటి భాగం ట్రైలర్‌ను విడుదల చేయనున్న విషయం తెలిసిందే. దీనికోసం ఇప్పట్నుంచే ప్రచారం మొదలుపెట్టేశారు. ముందే చెప్పినట్టుగా మే 1న, మే 4న సినిమా పోస్టర్లను విడుదల చేశారు. ఈ పోస్టర్లను చూసిన వారంతా ముక్తకంఠంతో ‘సూపర్’ అంటున్నారు. ప్రభాస్ ఈ సినిమాలో శివుడుగా అదరగొట్టాడనే విషయం పోస్టర్ ద్వారానే తెలిసిపోయింది.

ఇక ఇదే వరుసలో మూడో పోస్టర్‌గా దేవసేన పాత్ర పోషించిన అనుష్క పోస్టర్ రానుంది. ఈ పోస్టర్‌పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. మే 6న ఈ పోస్టర్ రిలీజ్ కానుంది. ఇదే విషయాన్ని రాజమౌళి కన్‌ఫర్మ్ చేస్తూ మే 6న బాహుబలిలో దేవసాన‌గా నటించిన అనుష్క పోస్టర్ రిలీజ్ కానుందని తెలిపారు. అనుష్క పాత్ర బాహుబలి రెండో భాగంలో ఎక్కువగా ఉంటుందని మొదటి భాగంలో ఆమెది చిన్న పార్ట్ మాత్రమేనని, ఈ పాత్రలో ఆమె సరికొత్తగా కనిపించి మెప్పిస్తారని రాజమౌళి ఈ సందర్భంగా తెలిపారు.

ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోబు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీత సారధ్యంలో రూపొందిన ఆడియోను జూన్ నెలలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ‘బాహుబలి ది బిగినింగ్‌’గా పిలవబడుతున్న మొదటి భాగం జూలై 10న విడుదల కానుంది.

తాజా వార్తలు