‘ఝాన్సీ లక్ష్మీబాయి’గా అనుష్క.. నిజమేనా ?

‘ఝాన్సీ లక్ష్మీబాయి’గా అనుష్క.. నిజమేనా ?

Published on Jul 3, 2019 12:21 PM IST

మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రుపొందుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రాన్ని అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల చెయ్యాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉంది. ఇక ఈ సినిమా మొత్తంలో మెగాస్టార్ పాత్ర తరువాత మరో పాత్రకి కూడా ప్రత్యేకమైన గుర్తింపు వస్తోందట. ఆ పాత్రలోనే అనుష్క నటించిదట. అయితే మొదట ఈ సినిమాలో అనుష్క పాత్ర స్టోరీ టెల్లర్ గా ఉంటుందని వార్తలు వినిపించాయి. కానీ తాజాగా అనుష్క సైరాలో ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో నటించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో అనుష్కకు సంబంధించిన లుక్ ను త్వరలోనే విడుదల చేయనున్నారు.

సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాలో సుదీప్, అమితాబ్ బచ్చన్, జగపతిబాబు వంటి స్టార్ లు నటిస్తున్నారు. అందుకే సైరా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా.. హిందీ, కన్నడ మరియు తమిళ ప్రేక్షకులు కూడా సినిమా పై ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఇక ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు