‘రుద్రమదేవి’లో అనుష్క సర్ ప్రైజ్ చేస్తుందా..?

‘రుద్రమదేవి’లో అనుష్క సర్ ప్రైజ్ చేస్తుందా..?

Published on Jan 9, 2015 3:06 PM IST

Rudhramadevi
ఓరుగల్లు ఘనతను చాటి చెప్పిన కాకతీయ వీరనారి రాణి రుద్రమదేవి జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న చారిత్రాత్మక సినిమా ‘రుద్రమదేవి’లో అనుష్క రాణిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, కధానుసారం సినిమాలో కొన్ని సన్నివేశాలలో అనుష్క మగ వేషం వేసిందట. రాజుగా కనిపించి ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తుందని సమాచారం. శత్రుసైన్య రాజులను మట్టికరిపించే సందర్భంలో రాజుగా నటించింది. ఈ సినిమా కోసం కత్తి యుద్దాలు, గుర్రపు స్వారీ, విలు విద్యలు నేర్చుకుంది. యాక్షన్ సన్నివేశాలలో అద్బుత ప్రతిభ కనబరిచిందని యూనిట్ సభ్యులు వెల్లడించారు.

గుణ టీం వర్క్స్ పతాకంపై శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చాళుక్య వీరబద్రుడి పాత్రలో దగ్గుబాటి రానా, కీలకమైన గోన గన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్ నటించారు. కృష్ణం రాజు, సుమన్, ప్రకాశ్‌ రాజ్, నిత్యా మీనన్, క్యాథరిన్, ప్రభు తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఇండియాలో తెరకెక్కుతున్న ఫస్ట్ హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ 3డి సినిమా ఇది.

తాజా వార్తలు