సింగపూర్లో అనుష్క ‘జీరో సైజ్’ ఆడియో

సింగపూర్లో అనుష్క ‘జీరో సైజ్’ ఆడియో

Published on Jul 7, 2015 10:31 AM IST

anushka
తెలుగు ప్రేక్షకుల మదిలో జేజెమ్మగా గుర్తుండిపోయిన స్టార్ హీరోయిన్ అనుష్క. ఈ యోగ బ్యూటీకి ఒక్క తెలుగులోనే కాకుండా తమిళంలో కోసా స్టార్ హీరోయిన్ ఇమేజ్ ఉంది. నేటితరం లేడీ ఓరియెంటెడ్ సినిమాల స్పెషలిస్ట్ అయిన అనుష్క చేస్తున్న లేటెస్ట్ లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ ‘జీరో సైజ్’. రెండు నెలల క్రితమే మొదలైన ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ కి సంబందించిన షూటింగ్ జరుగుతోంది.

ఈ సినిమా షూటింగ్ చివరి దశకి చేరుకోవడంతో ఈ చిత్ర టీం ఈ సినిమా ఆడియో లాంచ్ కోసం వ్యాహరచన చేస్తున్నారు. మాకు అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా ఆడియోని మలేషియా లేదా సింగపూర్ లో లాంచ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. అక్కడ ఉన్న తెలుగు, తమిళ వారికి రీచ్ అవ్వాలి, అలాగే సినిమాని హై రేంజ్ లో ప్రమోట్ చెయ్యడం కోసం అక్కడ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఓ మంచి వేదిక కోసం చూస్తున్నారు. వేదిక ఫిక్స్ అవ్వగానే ఆడియో రిలీజ్ డేట్ ని కూడా ఫైనలైజ్ చేస్తారు. జూలైలోనే ఆడియో రిలీజ్ ఉండే అవకాశం ఉంది.

ఈ సినిమాలో అనుష్క రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపించనుంది. పివిపి సినిమాస్ బ్యానర్ లో పరమ్ వి పొట్లూరి నిర్మించనున్న ఈ సినిమాకి రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి డైరెక్టర్. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో ఆర్య, సోనాల్ చౌహాన్, భరత్, ఊర్వసి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో షూటింగ్ చేస్తున్న ఈ సినిమాకి ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ రొమాంటిక్ కామెడీ మూవీకి ప్రకాష్ కోవెలమూడి భార్య అయిన కనిన ధిల్లన్ కథ – స్క్రీన్ ప్లే అందించింది.

తాజా వార్తలు