ఆర్య, అనుష్క ప్రధాన పాత్రల్లో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే! ప్రతిష్టాత్మిక పీవీపీ సంస్థ ‘సైజ్ జీరో’ పేరుతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలో ఈ సినిమా ‘ఇంజి ఇడుప్పజాగి’ పేరుతో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో అనుష్క ఇప్పటివరకూ కనిపించని సరికొత్త పాత్రతో అలరించనున్నారు.
‘సైజ్ జీరో’ సినిమాలో కొంత భాగం ఎక్కువ బరువున్న వ్యక్తిగా కనిపిస్తూ తర్వాత ‘సైజ్‌జీరో’కు మారిపోయే పాత్రలో అనుష్క కనిపించనుందని తెలుస్తోంది. ఇందుకోసం ఆమె 25 కిలోల బరువు పెరిగి మళ్ళీ సన్నబడ్డారని సమాచారం. పూర్తి రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ ఈషా గుప్త, స్టార్ హీరోయిన్ శృతిహాసన్ అతిథి పాత్రల్లో కనిపించనున్నారు.
తాజా సమాచారం మేరకు ఈ సినిమా షూటింగ్ దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకుందని తెలుస్తోంది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా ఇప్పటికే మొదలుపెట్టేశారు. ఆర్య, అనుష్కల మధ్యన వచ్చే లవ్ సీన్స్, కామెడీ ఈ సినిమాకు మేజర్ హైలైట్‌గా నిలుస్తాయని సమాచారం.
