
ఇన్ని రోజులు హైట్ కి తగగా పర్సనాలిటీ మైంటైన్ చేస్తూ నాజూకుగా కనిపించిన సౌత్ ఇండియన్ మోస్ట్ హీరోయిన్ అనుష్క ఒక్కసారిగా వెయిట్ పెరిగిపోయి బాగా బొద్దుగా తయారై చేసిన సినిమా ‘సైజ్ జీరో’. అనుష్క – తమిళ యంగ్ హీరో ఆర్య కలిసి నటించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ షూటింగ్ కి నిన్నటితో గుమ్మడికాయ కొట్టేసారు. దాదాపు షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమాలోని ఓ సాంగ్ మాత్రం బాలన్స్ ఉంది. గత నాలుగు రోజులుగా రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ఓ సెట్ లో ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఈ సాంగ్ ని షూట్ చేసారు. ఈ సాంగ్ షూట్ నిన్నటితో పూర్తవడంతో, సైజ్ జీరో టీం షూటింగ్ పార్ట్ కి గుమ్మడి కాయ కొట్టేసారు.
సైజ్ జీరోలో అనుష్క చేసిన సౌందర్య పాత్ర కోసం అమాంతం 20 కిలోలు బరువు పెరిగి చేసిన ఈ సినిమాలో రొమాన్స్ తో పాటు కామెడీకి కూడా పెద్ద పీట వేసారు. బాగా బొద్దుగా ఉండే అనుష్క సినిమాలో బరువు తగ్గడానికి చేసే ప్రయత్నాలు ప్రేక్షకులను బాగా నవ్విస్తాయని అంటున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా ఆడియోని సెప్టెంబర్ 6న మలేషియా రాజధాని అయిన కౌలాలాంపూర్ లో చాలా భారీ ఎత్తున చేయనున్నారు. ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాని అక్టోబర్ 2న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేసారు.
పివిపి సినిమాస్ బ్యానర్ లో పరమ్ వి పొట్లూరి నిర్మించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో సోనాల్ చౌహాన్, ప్రకాష్ రాజ్, భరత్, ఊర్వసి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందించిన ఈ మూవీకి ప్రకాష్ కోవెలమూడి భార్య అయిన కనిన ధిల్లన్ కథ – స్క్రీన్ ప్లే అందించింది

