మహేష్ ఈ సాలిడ్ డైరెక్టర్ తో..ఛాన్స్ ఉందా.?

Published on Jun 5, 2021 3:03 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన లేటెస్ట్ చిత్రం “సర్కారు వారి పాట”తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రం అనంతరం మరో రెండు బిగ్ ప్రాజెక్ట్స్ తో కూడా మహేష్ సిద్ధం కానున్నాడు. అయితే మరి అవి కాకుండా మరో బడా ప్రాజెక్ట్ మహేష్ చేయనున్నాడని చేస్తాడేమో అని పలు అనుమానాలు నిన్నటి నుంచి సినీ వర్గాల్లో మొదలయ్యాయి.

అదే ఇపుడు ఇండియన్ సినిమా దగ్గర మోస్ట్ వాంటెడ్ గా మారుస్తున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ తో.. అయితే నీల్ మన టాలీవుడ్ ఓ ప్రముఖ నిర్మాణ సంస్థతో సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నాడు. అలాగే అదే నిర్మాణ సంస్థతో మహేష్ డేట్స్ కూడా ఉన్నాయని టాక్ నడుస్తుంది. అలా ఈ కాంబో కూడా సెట్టవుతుందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. కానీ వాస్తవానికి ఇందులో ఇంకా ఎలాంటి నిజమూ లేనట్టు తెలుస్తుంది. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది..

సంబంధిత సమాచారం :