AP04 రామాపురం టైటిల్, మోషన్ పోస్టర్ విడుదల

AP04 రామాపురం టైటిల్, మోషన్ పోస్టర్ విడుదల

Published on Feb 3, 2021 8:00 AM IST

ap04

అర్ అర్ క్రియేటివ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్ వి శివ రెడ్డి సమర్పణలో రామ్ జాక్కల, అఖిల ఆకర్షణ, పి.యన్ రాజ్, సునీల్ మల్లెం నటీనటులుగా హేమ రెడ్డి దర్శత్వంలో రామ్ రెడ్డి అందూరి నిర్మించిన చిత్రం ‘AP04 రామాపురం’. ఈ సినిమా టైటిల్, మోషన్ పోస్టర్ల ను ప్రముఖ సినీ, రాజకీయ నాయకులు అవిష్కరించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరైన కిరణ్ అబ్బవరం సినిమా టైటిల్ ను, కడప నగర మాజీ మేయర్ & వైస్సార్సీపీ కడప పార్లమెంటరీ అధ్యక్షులు సురేష్ బాబు టైటిల్ వీడియో ను, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా సినిమా మోషన్ పోస్టర్ ను కడప నగరంలోని YSR ఆడిటోరియం నందు ఆవిష్కరించారు. ఇంకా ఈ కార్యక్రమం లో సైకం రామ కృష్ణా రెడ్డి (పీపుల్ లీడర్) కె. చంద్రా రెడ్డి గోల్డ్ షాప్ నాగరాజు. సినిమా లో నటించిన నటీనటులు, సాంకేతిక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు