పేరు మార్చుకోనున్న ఏపి ఫిల్మ్ చాంబర్.!

పేరు మార్చుకోనున్న ఏపి ఫిల్మ్ చాంబర్.!

Published on Apr 26, 2015 2:22 PM IST

ap-chamber
సినీ పరిశ్రమలో జరిగే అన్ని కార్యక్రమాలకు పెద్ద దిక్కుగా స్థాపించినదే ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ చాంబర్ అఫ్ కామర్స్. రాష్ట్రాల విభజనతో ఇది కూడా ఫిల్మ్ చాంబర్ కూడా రెండు గా చీలిపోయింది. ఇప్పటికే తెలంగాణ ఫిల్మ్ చాంబర్ అఫ్ కామర్స్ మొదలైంది. ఇప్పుడు ఇక్కడ విషయం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ చాంబర్ అఫ్ కామర్స్ మెంబర్స్ అంతా కలిసి ఈ రోజు విజయవాడలో మీటింగ్ జరుగుతోంది. ఇందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ చాంబర్ అఫ్ కామర్స్ పేరు మార్చడానికి వారు చర్చలు జరుపుతున్నారు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ చాంబర్ అఫ్ కామర్స్ అని ఉన్న పేరును తెలుగు ఫిల్మ్ చాంబర్ అఫ్ కామర్స్ అనే పేరుకి మార్చడానికి పలువురు ఆసక్తి చూపుతున్నారు.

రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచే ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ చాంబర్ అఫ్ కామర్స్ వారు పేరు పార్చాలని అనుకుంటున్నారు. అందులో భాగంగా ఏపి ఫిల్మ్ చాంబర్ వారు విజయవాడలో మీటింగ్ పెడితే, తెలంగాణ నిర్మాతలు దీనికి వ్యతిరేఖంగా హైదరాబాద్ లో చర్చలు జరుపుతున్నారు. వీళ్ళంతా తెలుగు అని పెట్టడానికి అంగీకరించడం లేదు. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ చాంబర్ అఫ్ కామర్స్ ఇలా పేరు మార్చడానికి గల అసలు కారణం ఏమిటా అంటే రెండు ఫిల్మ్ ఇండస్ట్రీస్ కి చెందిన తెలుగు వారిని రెప్రజెంట్ చేసేలా ఉంటుందని భావిస్తున్నారు.

తాజా వార్తలు