సమ్మెకు ముగింపు పలికిన ఫిల్మ్ ఫెడరేషన్..

సమ్మెకు ముగింపు పలికిన ఫిల్మ్ ఫెడరేషన్..

Published on Dec 6, 2014 4:48 PM IST

Tollywood
నేటి నుండి తెలుగు సినిమా షూటింగులు ప్రారంభం అయ్యాయి. గత వారం రోజులుగా సమ్మె చేస్తున్న ఎపి ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు, సినీ కార్మికులు తమ సమ్మెకు ముగింపు పలికారు. నిర్మాతల మండలి మరియు ఫిల్మ్ ఫెడరేషన్ నాయకుల మధ్య జరిగిన చర్చలు సఫలం కావడంతో సమ్మెను విరమించారు.

ముఖ్యంగా సంక్రాంతికి తమ సినిమాలను విడుదల చేయాలని సంకల్పించిన నిర్మాతలు.. సమ్మె విరమణతో ఊపిరి పీల్చుకున్నారు. ‘టెంపర్’, ‘గోపాల గోపాల’, ‘బాహుబలి’, శంకర్ ‘ఐ’ సినిమాల పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్, సినిమా షూటింగులు ప్రారంభమయ్యాయి. ఇవే కాకుండా పలువురు చిన్న సినిమా నిర్మాతలు సమ్మె విరమణ పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిత్రీకరణ సగంలో ఆగిపోతే నిర్మాణ వ్యయం పెరిగి, నష్టం కలిగే అవకాశం ఏర్పడేదని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు