వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ గద్దలకొండ గణేష్ బాక్సాఫీస్ వద్ద ఊహించనికలెక్షన్స్ సాధిస్తుంది. వీకెండ్ పూర్తియ్యే నాటికి ఈ చిత్ర వసూళ్లు నిలకడగా కొనసాగడం విశేషం. మొదటి షో నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం విజయం వైపుగా దూసుకుపోతుంది. కాగా తెలుగు రాష్ట్రాలలో మూడురోజులకు గాను గద్దలకొండ గణేష్ చిత్రం 13.4కోట్ల షేర్ సాధించింది. ఇది వరుణ్ గత హిట్ చిత్రాలైన ఫిదా, తొలిప్రేమ లకంటే చాలా ఎక్కువ. ఊరమాస్ గ్యాంగ్ స్టర్ అవతారంలో వరుణ్ నటన ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది.
అలాగే యూఎస్ లో కూడా ఈ చిత్ర వసూళ్లు ఆశాజనకంగానే ఉన్నట్లు వస్తున్న రిపోర్ట్స్ చూస్తే అర్థం అవుతుంది. ఇక సోమవారం నుండి వచ్చే వసూళ్లను బట్టి ఈ చిత్రం ఏస్థాయి విజయం సాధిస్తుందో చెప్పవచ్చు. ఐతే వచ్చే వారం చెప్పుకోదగ్గ పెద్ద సినిమాల విడుదల లేకపోవడం అలాగే సూర్య బందోబస్త్ మిక్స్డ్ టాక్ తెచ్చుకోవడం ఈ మూవీ వసూళ్లకు అనుకూలించే అంశం. అక్టోబర్ 2న సైరా విడుదల అయ్యేవరకు గద్దలకొండ గణేష్ చిత్ర వసూళ్ల జోరు కొనసాగే అవకాశం కలదు.
