హిట్ మొదటిరోజు ఏపీ/తెలంగాణా కలెక్షన్స్

Published on Feb 29, 2020 12:06 pm IST

హీరో విశ్వక్ సేన్ లేటెస్ట్ మూవీ హిట్ నిన్న విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దర్శకుడు శైలేష్ కొలను హై ఇంటెన్స్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా తెరకెక్కించాడు. కాగా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు చెప్పుకోదగ్గ వసూళ్లనే రాబట్టినట్లు తెలుస్తుంది. ఏపీ మరియు తెలంగాణాలలో కలిపి ఈ చిత్రం 1.4 కోట్ల షేర్ వసూలు చేసింది. పాజిటివ్ టాక్ రీత్యా నేడు మరియు ఆదివారం వసూళ్లు మెరుగయ్యే అవకాశం కలదు.

కాగా హీరో నాని సొంత నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నిర్మాతగా నానికి ఇది రెండో చిత్రం. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా రుహాని శర్మ నటించింది. ఈ చిత్రానికి సంగీతం వివేక్ సాగర్ అందించారు.

సంబంధిత సమాచారం :

X
More