“మీర్జాపూర్ 2” బ్యాన్ చెయ్యాలని అక్కడ నుంచే డిమాండ్.!

Published on Oct 25, 2020 8:42 pm IST

మన ఇండియన్ వెబ్ సిరీస్ హిస్టరీలోనే ఒక సెన్సేషన్ గా నిలిచింది అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కాబడ్డ “మీర్జాపూర్” సిరీస్ అనే చెప్పాలి. సీజన్ 1 తో అన్ని భాషల్లోనూ సెన్సేషన్ సృష్టించిన ఈ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ లో అన్ని హంగులతో పాటు కాంట్రవర్సీలకు ఈ సిరీస్ పెట్టింది.

అయినప్పటికీ ఎన్నో డిమాండ్స్ నడుమ ఈ సిరీస్ కు కొనసాగింపుగా డిజైన్ చేసిన రెండో సీజన్ ను కూడా అమెజాన్ ప్రైమ్ వారు విడుదల చేశారు. ఇక ఇది విడులయ్యాక అలాగే కాక ముందు కూడా ఈ సిరీస్ ను బ్యాన్ చెయ్యాల్సిందే అని ఇంకా నినాదాలు వినిపిస్తూనే ఉన్నాయి.

అయితే ఈసారి లక్నో లోని ఈ మీర్జాపూర్ అనే ప్రాంతం నుంచే ఈ సిరీస్ ను బ్యాన్ చెయ్యాలని గట్టి డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఈ వెబ్ సిరీస్ లోని కొన్ని అంశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని మీర్జాపూర్ ప్రాంతాన్ని తప్పుగా చూపించారని అక్కడి ఎంపీ అప్నాదళ్ ఎంపీ అనుప్రియ ఈ సిరీస్ ను బ్యాన్ చెయ్యవల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More