ఓల్డ్ సిటీ నేపధ్యంలో అప్పట్లో ఒకడుండేవాడు

ఓల్డ్ సిటీ నేపధ్యంలో అప్పట్లో ఒకడుండేవాడు

Published on May 30, 2015 6:13 PM IST

nara-rohit
కమర్షియల్ చట్రంలో నలిగిపోకుండా విలక్షణ చిత్రాలు చేసుకుంటూ వెళ్ళడం నారారోహిత్ స్పెషాలిటీ. ప్రస్తుతం రోహిత్ ‘అసుర’ విడుదలకు సిద్ధంగా వుంది. తాజా సమాచారం ప్రకారం రోహిత్ తదుపరి సినిమా హైదరాబాద్ ఓల్డ్ సిటీ నేపధ్యంలో సాగే యాక్షన్ ఎంటర్టైనర్ గా ‘అప్పట్లో ఒకడుండేవాడు’ టైటిల్ తో తెరకెక్కనుంది.

ఈ ప్రాజెక్ట్ ని ‘అయ్యారే’ ఫేం సాగర్ కే చంద్ర తెరకెక్కించనున్నాడు. ‘ప్రేమ ఇష్క్ కాదల్’ చిత్రంలో నటించిన శ్రీ విష్ణు ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించనున్నాడు.

90వ దశకంలో సాగే యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా వుంది. ఈ సినిమాను విశిష్ట మూవీస్ బ్యానర్ పై హరి మరియు సన్నీ రాజు నిర్మిస్తున్నారు. జూన్ మొదటి వారంలో ఈ చిత్రం ప్రారంభంకానుంది.

తాజా వార్తలు