AR Murugadoss: తన ఫస్ట్ సినిమా ఐడియాతో మురుగదాస్ నెక్స్ట్.. క్రేజీ సబ్జెక్ట్!

AR Murugadoss: తన ఫస్ట్ సినిమా ఐడియాతో మురుగదాస్ నెక్స్ట్.. క్రేజీ సబ్జెక్ట్!

Published on Dec 31, 2025 3:00 PM IST

AR-Murugadoss

తనదైన సినిమాలతో సాలిడ్ వర్క్ ని అందించి తమిళ్ సహా తెలుగు ఆడియెన్స్ ని మెస్మరైజ్ చేసిన స్టార్ దర్శకుల్లో ఏ ఆర్ మురుగదాస్ (AR Murugadoss) కూడా ఒకరు. సాలిడ్ కమర్షియల్ సబ్జెక్టు లని మంచి మెసేజ్ తో చెప్తూ అప్పటికే దర్శకుడు శంకర్ మంచి స్టాండర్డ్స్ ని సెట్ చేసుకున్నప్పటికీ తన స్టైల్ ఆఫ్ సినిమాలతో ఏ ఆర్ మురుగదాస్ కూడా మంచి ముద్ర వేసుకున్నారు. ఇలా మారుతున్న కాలంలో కొంచెం టైం తీసుకుంటూనే తనదైన కొత్త తరహా సినిమాలు చేస్తూ వస్తున్న మురుగదాస్ ఇప్పుడు నెక్స్ట్ సినిమాగా ఓ ఆసక్తికర సబ్జెక్టు ప్లాన్ చేస్తున్నట్టు రివీల్ చేసినట్టు తెలుస్తుంది.

Monkey as lead role in Murugadoss next – కోతి ప్రధాన పాత్రలో మురుగదాస్ నెక్స్ట్..

అవును, ఒక కోతిని మెయిన్ లీడ్ లో పెట్టి మురుగదాస్ (AR Murugadoss) తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని ప్లాన్ చేస్తున్నట్టు ఇటీవల తమిళ మీడియాలో రివీల్ చేసినట్టు తెలుస్తుంది. మురుగదాస్ కి ప్రయోగాత్మక సినిమాలు కొత్తేమి కాదు. కానీ ఈసారి ఒకడుగు ముందుకేసి గ్రాఫిక్స్ తో కూడిన ఫన్ చిత్రాన్ని తాను ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు.

Murugadoss first ever planned film – ఇదే మురుగదాస్ మొదటి సినిమా

ఏ ఆర్ మురుగదాస్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా ‘ధీనా’. స్టార్ హీరో అజిత్ తో చేసిన ఈ సినిమా 2001లో చేశారు. కానీ అసలు దీనికంటే ముందే ఇప్పుడు చేయాలి అనుకుంటున్న సబ్జెక్టు తాను మొదటిగా చేయాలి అనుకున్నారట. తాను అసిస్టెంట్ దర్శకునిగా చేస్తున్న సమయంలోనే తనకి ఒక కోతిని పెట్టి సినిమా తీయాలని పిల్లలకి బాగా నచ్చే విధంగా ఆ సినిమా ఉంటుంది అని తాను తెలిపారు.

సో మురుగదాస్ అనుకుంటున్న తన ఫస్ట్ సినిమా చేసేందుకు ఇంత సమయం పట్టింది. మరి తన స్టైల్ లో ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఈ ఏడాదిలో అయితే తాను తెరకెక్కించిన ‘మదరాసి’తో డీసెంట్ కంబ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు