
సంగీత ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకోవడమే కాకుండా, ఓ ఇండియన్ సినిమాకి మ్యూజిక్ విభాగంలో అత్యంత ప్రసిద్ది చెందిన ఆస్కార్ అవార్డు తెచ్చి పెట్టిన ఘనత కూడా ఎఆర్ రెహమాన్ కి దక్కింది. ఇప్పటివరకూ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ అందించిన రెహమాన్ రైటర్ గా మరియు నిర్మాతగా మారి ఓ సినిమా చేయనున్నాడని ఇది వరకే తెలియజేశాం. ఒకేసారి తమిళ – హిందీ భాషల్లో రూపొందించనున్న ఈ సినిమాకి తమిళంలో ’99 పదంగల్’ అనే టైటిల్ ని ఫిక్స్ చేస్తే హిందీలో ’99 సాంగ్స్’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు.
మ్యూజికల్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమా కోసం అప్పుడే ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ వర్క్ ని ఫినిష్ చేసాడు. మొత్తం 10 పాటలుండే ఈ ఆల్బం కోసం అన్ని ట్యూన్స్ ని కంపోజ్ చేసేసాడు. మిగిలిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్న ఈ సినిమా ద్వారా విశ్వేష్ కృష్ణమూర్తి డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. ఎఆర్ రెహమాన్ ఈ సినిమాని తన సొంత బ్యానర్ వైఎం మూవీస్ లో నిర్మించడమే కాకుండా ఈ సినిమాకి కథ – స్క్రీన్ ప్లే – మ్యూజిక్ కూడా అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా కోసం నూతన నటీనటులను సెలెక్ట్ చేసే పనిలో ఉన్నారు.

