మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన సాలిడ్ మాస్ చిత్రం “పెద్ది”. ఇంటెన్స్ ఎమోషన్స్ మరియు అలరించే యాక్షన్ మూమెంట్స్ తో తెరకెక్కించిన ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కాబోతుంది. అయితే ఈ చిత్రం మేకర్స్ నిన్న భారీ ఈవెంట్ ని భోపాల్ లో చేయగా అక్కడ రెహమాన్ లైవ్ పెర్ఫామెన్స్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
అయితే ఇదే ఈవెంట్ లో పెద్ది నుంచి ఓ సాంగ్ మాత్రం ఊహించని సర్ప్రైజ్ అని చెప్పొచ్చు. మస్సా మస్సా అంటూ సాగే మాస్ నెంబర్ కోసం అభిమానులు ఎదురు చూసారు. అయితే ఈ సాంగ్ విన్నాక మాత్రం ఇది పెద్ది ఆల్బమ్ లోనే బిగ్గెస్ట్ అండ్ ఇన్స్టంట్ హిట్ సాంగ్ అని చెప్పాలి. మరీ ముఖ్యంగా రెహమాన్ నుంచి ఎంతో కాలం నుంచి మిస్ అవుతున్న తన వింటేజ్ మార్క్ లో ఈ సాంగ్ ఉంది. ఇక హిందీలో అయితే కంప్లీట్ గా ఒక బాలీవుడ్ సాంగ్ తరహాలో ఉంది. దీనితో డెఫినెట్ గా బాలీవుడ్ ఆడియెన్స్ పెద్ది మరింత దగ్గర కావడం ఈ సాంగ్ తో గ్యారెంటీ అని చెప్పవచ్చు.


