మ్యూజిక్ డైరెక్టర్ గా మారిన ఏఆర్ రెహమాన్ కూతురు!

మ్యూజిక్ డైరెక్టర్ గా మారిన ఏఆర్ రెహమాన్ కూతురు!

Published on Jun 12, 2023 4:32 PM IST

rajh

ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడిన ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కూతురు ఖతీజా రెహమాన్ ఇప్పుడు తానే సంగీత దర్శకురాలిగా మారారు. సిల్లు కారుపత్తి ఫేమ్ హలిత షమీమ్ దర్శకత్వం వహిస్తున్న మిన్మిని చిత్రంతో ఆమె సంగీత దర్శకురాలిగా అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉంది. డైరెక్టర్ హలిత సోషల్ మీడియా ఈ విషయాన్ని వెల్లడించారు. రికార్డింగ్ స్టూడియోలో ఖతీజాతో కలిసి ఉన్న చిత్రాన్ని అభిమానులతో పంచుకున్నారు.

మిన్మిని కోసం ఖతీజా రెహమాన్‌తో కలిసి పని చేస్తున్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ సింగర్ అద్భుతమైన సంగీత దర్శకుడు కూడా. అద్భుతమైన సంగీతం రాబోతుంది అని పేర్కొనడం జరిగింది. మిన్మినీలో ఎస్తేర్ అనిల్, హరి కృష్ణన్, గౌరవ్ కలై మరియు ప్రవీణ్ కిషోర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయి, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

తాజా వార్తలు