
అందాల రాక్షసి సినిమా దర్శకుడు హను రాఘవపుడి మరియు నాని కాంబినేషన్ లో వస్తున్న తరుపరి సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలో వుందిఈ సినిమాకు ఏ.ఆర్ రెహమాన్ శిష్యుడు విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందించనున్నారు. విశాల్ గతంలో సంతోష్ శివన్ ‘ఇనమ్’ సినిమాకు సంగీతం అందించాడు.
ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్ నడుస్తున్నట్టు సమాచారం. ఈ యువ సంగీత దర్శకుడు తన ట్యూన్ లతో అందరినీ అబ్బురపరుస్తున్నాడట. హను రాఘవపుడికి మ్యూజిక్ సెలక్షన్ లో మంచి టెస్ట్ వున్నట్టు ఇప్పటికే రుజువైందికాబట్టి ఈ కాంబినేషన్ నుండి ఒక మంచి మ్యుజిక హిట్ ఆశించవచ్చు.