“అరణ్మనై 3” నుంచి రేపు మరో సింగిల్ రాబోతుంది..!

“అరణ్మనై 3” నుంచి రేపు మరో సింగిల్ రాబోతుంది..!

Published on Oct 5, 2021 9:23 PM IST

తమిళ ఇండస్టీలో హారర్ కామెడీ సినిమాలు చేయడంలో సుందర్.సి కి మంచి ప్రావీణ్యం ఉంది. ఆయన తెరకెక్కించిన అరణ్మనై’, ‘అరణ్మనై 2’ సినిమాలు మంచి విజయాలను నమోదు చేసుకున్నాయి. తెలుగులో ‘కళావతి’, ‘చంద్రకళ’ పేర్లతో వచ్చి ఇక్కడ కూడా గాబానే కలెక్షన్లను రాబట్టాయి. అయితే సుందర్.సి ఇప్పుడు ముచ్చటగా ‘అరణ్మనై 3’ సినిమాను రూపొందించాడు.

తమిళ హీరో ఆర్య, రాశి ఖన్నా జంటగా నటించిన ఈ సినిమా అక్టోబర్ 14వ తేదీన విడుదల కాబోతుంది. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన సింగిల్స్ కి మంచి రెస్పాన్స్ రాగా రేపు 4వ సింగిల్ రానున్నట్టుగా చిత్ర బృందం తెలిపింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో సంపత్ రాజ్, ఆండ్రియా, సాక్షి అగర్వాల్, యోగిబాబు ముఖ్యమైన పాత్రల్లో నటించారు. సత్య సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నట్టు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు