హారర్ కామెడీ ‘అరణ్మనై 3’ ట్రైలర్ ఎప్పుడంటే?

Published on Sep 29, 2021 2:00 am IST


తమిళ ఇండస్టీలో హారర్ కామెడీ సినిమాలు చేయడంలో సుందర్.సి కి మంచి ప్రావీణ్యం ఉంది. ఆయన తెరకెక్కించిన అరణ్మనై’, ‘అరణ్మనై 2’ సినిమాలు మంచి విజయాలను నమోదు చేసుకున్నాయి. తెలుగులో ‘కళావతి’, ‘చంద్రకళ’ పేర్లతో వచ్చి ఇక్కడ కూడా గాబానే కలెక్షన్లను రాబట్టాయి. అయితే సుందర్.సి ఇప్పుడు ముచ్చటగా ‘అరణ్మనై 3’ సినిమాను రూపొందించాడు.

తమిళ హీరో ఆర్య, రాశి ఖన్నా జంటగా నటించిన ఈ సినిమా అక్టోబర్ 14వ తేదీన విడుదల కాబోతుంది. ఈ నేపధ్యంలో ఈ నెల 30వ తేదీన సాయంత్రం 5 గంటలకు ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేయబోతున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో సంపత్ రాజ్, ఆండ్రియా, సాక్షి అగర్వాల్, యోగిబాబు ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.

సంబంధిత సమాచారం :