అరవింద ప్రీ రిలీజ్ వేడుక తేదీ ఖరారు !

అరవింద ప్రీ రిలీజ్ వేడుక తేదీ ఖరారు !

Published on Sep 28, 2018 4:02 PM IST

ntr51

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న అరవింద సమేత వీర రాఘవ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇక ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్టోబర్ 2న జరుగనుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈచిత్రం యొక్కఆడియో సూపర్ హిట్ కావడంతో ఈసినిమాపై ఎన్టీఆర్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

రాయలసీమ బ్యాక్ డ్రాప్లో ఫ్యాక్షన్ కథతో రూపొందుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ రాయలసీమ యాసలో డైలాగ్స్ చెప్పనున్నారు. ఇక ఎన్టీఆర్ ఇటీవల నటించిన సినిమాలన్ని వరుస విజయాలు సాధించడంతో ఈచిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగిందట. హారిక హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 11న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు