‘అరవింద’ టీజర్ తో రాబోతున్నాడు !

‘అరవింద’ టీజర్ తో రాబోతున్నాడు !

Published on Aug 10, 2018 1:14 AM IST

Aravinda Sametha
‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రం టీజర్ కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుస్తున్నారు. కాగా త్రివిక్రమ్ ప్రస్తుతం ఈ చిత్రాన్ని శరవేగంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. కాగా ఈ చిత్ర టీజర్ ని కూడా విడుదలు చేసి తారక్ అభిమానులుతో పాటు ప్రేక్షకులను కూడా అలరించడానికి టీజర్ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసింది చిత్రబృందం. టీజర్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగష్టు 15న విడుదల చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయించారు. ఐతే కరెక్ట్ గా ఎన్నిగంటలకు విడుదల చేయనున్నారో త్వరలో తెలియనుంది.

ఇక ఈ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో జగపతిబాబు, నాగబాబు ఇద్దరు రెండు ఫ్యాక్షన్ గ్రూపులకు చెందిన నాయకుల పాత్రల్లో నటిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఫై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు