అరవింద సమేత ఆ రోజే రానుందా ?
Published on Jun 15, 2018 8:06 pm IST


యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న’అరవింద సమేత వీర రాఘవ’ 40 శాతం షూటింగ్ ను పూర్తిచేసుకుంది . ఈ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందని మనకు తెలిసిందే . అయితే ఇప్పుడు ఈసినిమా విడుదల తేదీ కూడా ఖరారైనట్లు తెలుస్తుంది . అక్టోబర్ 10(బుధవారం ) రోజున ఈ చిత్రం ప్రేక్షకులముందుకు రానుందని ట్రేడ్ వర్గాలనుండి సమాచారం అందుతుంది . రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో జగపతిబాబు మరియు నాగబాబు రెండు ఫ్యాక్షన్ గ్రూపులకు చెందిన నాయకుల పాత్రల్లో నటిస్తున్నారు.త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్నఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది . హారిక హాసిని క్రియేషన్స్ పతాకం ఫై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు .

గత ఏడాది కళ్యాణ్ రామ్ నిర్మాణంలో ఎన్టీఆర్ నటించిన ‘జై లవ కుశ’ సినిమా కూడా దసరా సీజన్ లోనే వచ్చి మంచి కలెక్షన్స్ ను రాబట్టింది . మరి వరుసగా నాలుగు సినిమాల విజయాలతో దూసుకుపోతున్న తారక్ ఈ అరవింద సమేత చిత్రంతో అదే ఫామ్ ను కొనసాగిస్తాడో లేదో చూడాలి .

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook