యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘అరవింద సమేత ‘చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతుంది. ఈ షెడ్యూల్ తరువాత చిత్ర యూనిట్ పాటల చిత్రీకరణ కోసం సెప్టెంబర్ మొదటి వారంలో విదేశాలకు వెళ్లనుంది. ఈ షెడ్యూల్ తో సెప్టెంబర్ 15న ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుంది. ఇక ఈ చిత్ర టీజర్ ను ఆగష్టు 15 న విడుదలచేయనున్నారని సమాచారం.
జగపతిబాబు , నాగబాబు లు వంటి తదితర భారీ తారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. హారిక హాసిని క్రియేషన్స్ పతాకం ఫై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం లో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే నటిస్తున్నారు. తెలుగు అమ్మాయి ఈషా రెబ్బ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈచిత్రం దసరా కానుకగా అక్టోబర్ 11న ప్రేక్షకులముందుకు రానుంది.


