అన్నపూర్ణకు షిఫ్ట్ అయిన అరవింద సమేత !
Published on Sep 10, 2018 8:30 pm IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘అరవింద సమేత’ చిత్ర షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది. నిన్నస్టార్ట్ అయిన ఈ కొత్త షెడ్యూల్లో సాంగ్ చిత్రీకరిస్తున్నారని సమాచారం. 3రోజుల పాటు అక్కడే షూటింగ్ జరుపుకోనుంది ఈ చిత్రం.

ఇక ఈ చిత్ర ఆడియో ను ఈనెల 20న విడుదల చేయనున్నారని సమాచారం. త్రివిక్రమ్ తెరెకెక్కిస్తున్న ఈ చిత్రం యొక్క పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ చిత్రానికి సంభందించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అక్టోబర్ మొదటి వారంలో గ్రాండ్ గా జరుపనున్నారట.

తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించింది. హారిక హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 11న విడుదలకానుంది. ఇక వరుస విజయాలతో కొనసాగుతున్న ఎన్టీఆర్ కు ఈచిత్రం కూడా విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి.

  • 36
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook