‘అర్థ శతాబ్దం’లో ఆకట్టుకుంటున్న ‘అరె మెరిసెలే..’ !

Published on Jun 6, 2021 12:08 am IST

‘కేరాఫ్ కంచెరపాలెం’ సినిమాతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కార్తీక్ రత్నం. కాగా తాజాగా కార్తీక్ రత్నం హీరోగా కృష్ణ ప్రియ హీరోయిన్ గా డైరెక్టర్ రవీంద్ర పుల్లే తెరకెక్కిస్తున్న చిత్రం ‘అర్థ శతాబ్దం’. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్‏కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సినిమాకి సంబంధించి ‘అరె మెరిసెలే.. మెరిసెలే.. మిలమిల మెరిసెలే’ అంటూ సాగే లిరికల్‌ సాంగ్‌ రిలీజ్ అయింది.

అయితే సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. రహ్మన్‌ సాహిత్యం బాగుండటం, పదాలను శంకర్‌ మహదేవన్‌ శ్రావ్యంగా ఆలపించడం, నవ్‌ఫాల్ రాజా ఎఐఎస్ సంగీతం చక్కగా ఉండటం మొత్తానికి ఈ సాంగ్ బాగానే అలరిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలోని ఓ సాంగ్ ఏ కన్నులు చూడనీ సాంగ్ మ్యూజిక్ లవర్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా జూన్ 11 నుంచి ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది.

సంబంధిత సమాచారం :