సంక్రాంతి రేసులో ఆ భారీ సినిమాలు లేనట్లే ?

Published on Oct 26, 2020 2:52 pm IST

కరోనా వచ్చి టాలీవుడ్ సినిమాల రిలీజ్ డేట్స్ ను అయోమయంలో పడేయటం, దాంతో సంక్రాంతికి సినిమాల పోటీ హోరాహోరీగా మారనుంది. ఎలాగూ సినిమా హాళ్లు కూడా సంక్రాంతి నాటికి పూర్తిస్థాయిలో తెరుచుకుంటాయి కాబట్టి.. తమ సినిమాలను సంక్రాంతి సీజన్లో విడుదల చేయాలని స్టార్ హీరోలు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’, మరో భారీ బడ్జెట్ చిత్రం ‘కెజిఎఫ్ 2’ సంక్రాంతికి ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

కాగా ఇంకొన్ని పెద్ద చిత్రాలు కూడా సంక్రాంతి బరిలో నిలిచే అవకాశం ఉంది. మరి ప్రభాస్ ‘రాథేశ్వామ్’, మెగాస్టార్ ‘ఆచార్య’ సినిమాలు మాత్రం సంక్రాంతి పోరులో ఉండవు అని, ఎందుకంటే మెగాస్టార్ ఆచార్య సినిమా షూటింగ్ ఎట్టి పరిస్తుతుల్లో అప్పటిలోగా పూర్తి కాదని, అలాగే ప్రభాస్ రాథేశ్వామ్ సినిమాకు కూడా ఎక్కువ విఎఫ్ఎక్స్ పనులు వున్నాయి కాబట్టి, ఈ సినిమాలు సంక్రాంతి రేసులో కష్టమే అని తెలుస్తోది.

ఇక అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, రవితేజ ‘క్రాక్’, గోపిచంద్ ‘సీటిమార్’, నాగచైతన్య ‘లవ్ స్టోరీ’లు కూడ సంక్రాంతికే విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :

More