అవినాష్ పెళ్లిపై అరియాన కామెంట్..!

Published on Sep 2, 2021 1:33 am IST


జబర్దస్త్ కార్యక్రమంలో తనదైన కామెడీతో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న ముక్కు అవినాష్ బిగ్‌బాస్ ద్వారా ఫుల్ పాపులారిటీనీ సంపాదించుకున్నాడు. కెరిర్ పరంగా దూసుకుపోతున్న అవినాష్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇటీవల నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్నప్పుడు అరియాన, అవినాష్ చనువుగా ఉండడం, బయటకొచ్చాక కూడా ఇద్దరు కలిసి ఈవెంట్స్ చేయడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ తెగ పుకార్లు ప్రచారం అయ్యాయి.

అయితే అవినాష్ తన పెళ్లి వార్తతో ఆ పుకార్లకు బ్రేక్ వేశాడు. దీనిపై స్పందించిన బిగ్‌బాస్ బ్యూటీ అరియానా అవినాష్ పెళ్లి చేసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందని, మా ఇద్దరి మధ్య ఏదో ఉందని చాలా రకాలుగా పుకార్లు వచ్చాయని, కానీ మేమిద్దరం మంచి స్నేహితులం అని, అవినాష్‌ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపాడు.

సంబంధిత సమాచారం :