యాక్టర్ అర్జున్ 15 ఏళ్ల కష్టం నెరవేరింది

Published on Jun 29, 2021 4:12 pm IST

ఒకప్పుడు తమిళం, తెలుగులో పలు హిట్ సినిమాలు చేసి స్టార్ క్రేజ్ సొంతం చేసుకున్నారు యాక్షన్ కింగ్. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి నెగెటివ్ రోల్స్, సపోర్టింగ్ పాత్రలు చేస్తున్నారు. అర్జున్ కు ఆంజనేయస్వామి అంటే ఎనలేని భక్తి. అందుకే గుడి కట్టాలని నిర్ణయించుకున్నారు. చెన్నై విమానాశ్రయం సమీపంలో ఉన్న తన సొంత స్థలంలో గుడి కట్టాలని సంకల్పించి 15 ఏళ్ల క్రితం పనులు మొదలుపెట్టారు.

అనేక వ్యయప్రయాసలకు ఓర్చి నేటికి ఆలయ నిర్మాణం పూర్తిచేశారు. దీంతో గుడిని మహాకుంభాభిషేకం నిర్వహించి ప్రారంభించాలని అనుకున్నారు. కానీ కరోనా కారణంగా స్నేహితులను, భక్తులను, శ్రేయోభిలాషులను పిలిచి కుంభాభిషేకం నిర్వహించే వీలు లేకుండా పోయింది. అందుకే ఈ గొప్ప కార్య‌క్ర‌మాన్ని ఎవ‌రూ మిస్ కాకూడ‌ద‌నే ఉద్దేశంతో లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ కుంభాభిషేకం జూలై 1, 2వ తేదీల్లో జరగనుంది.

సంబంధిత సమాచారం :