‘అయ్యప్పనుమ్‌’ హిందీ రీమేక్‌పై లేటెస్ట్ అప్డేట్..!

Published on Aug 31, 2021 2:20 am IST

మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియమ్‌’ తెలుగు, హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ కథ నచ్చడంతో జాన్‌ అబ్రహం హిందీ రీమేక్ హక్కులను కొనుగోలు చేశాడు. హిందీ సినిమాలో జాన్‌ అబ్రహం-అభిషేక్‌ బచ్చన్‌ నటిస్తున్నట్లు మొదట వార్తలు వినిపించగా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌ నుంచి అభిషేక్‌ బచ్చన్ తప్పుకున్నట్టు తెలుస్తుంది.

అయితే అభిషేక్ బచ్చన్ స్థానంలో అర్జున్ కపూర్ రానున్నట్టు తెలుస్తుంది. బిజూ మేనన్‌ పాత్రలో జాన్‌ అబ్రహం నటిస్తుండగా, పృథ్వీ రాజ్‌ పాత్రలో అర్జున్‌ కపూర్‌ కనిపించనున్నారు. జగన్‌శక్తి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ నవంబర్‌లో మొదలు కానుంది.

సంబంధిత సమాచారం :