అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ షూటింగ్ కంప్లీట్ !

అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ షూటింగ్ కంప్లీట్ !

Published on Mar 30, 2019 3:30 PM IST

Kabir Singh

బ్లాక్ బ్లాస్టర్ తెలుగు మూవీ ‘అర్జున్ రెడ్డి’ ఇప్పుడు హిందీ లో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. ‘ఖబీర్ సింగ్’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న హిందీ వెర్షన్ లో షాహిద్ కపూర్, కియరా అద్వానీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం యొక్క షూటింగ్ పూర్తయింది. ఒరిజినల్ వెర్షన్ ను తెరకెక్కించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ రీమేక్ ను డైరెక్ట్ చేస్తున్నాడు. జూన్ 21న ఈ చిత్రం విడుదలకానుంది.

ఇక అర్జున్ రెడ్డి హిందీ తో పాటు తమిళంలోనూ రీమేక్ కానుంది. తమిళ వెర్షన్ కు ఆదిత్య వర్మ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ చిత్రంలో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ హీరోగా నటించనున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు