అర్జున్ రెడ్డి రిలీజ్ డేట్ ఫిక్స్ !

Published on Apr 15, 2019 12:42 pm IST

అర్జున్ రెడ్డి కోలీవుడ్ లో ఈనెల 26న విడుదలకానుంది. అదేంటి ఈ సినిమా అక్కడ ఆదిత్య వర్మ గా రీమేక్ అవుతుంది కదా ఇప్పుడు విడుదలకావడం ఏంటని అనుకుంటున్నారా.. ఇది ఆ అర్జున్ రెడ్డి కాదు. ఇక విషయానికి వస్తే విజయ్ దేవరకొండ , పూజా జావేరి జంటగా నటించిన చిత్రం ద్వారకా 2017 లో విడుదలై మెప్పించలేకపోయింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని తమిళంలోకి ‘అర్జున్ రెడ్డి’ పేరుతో డబ్ చేసి విడుదలచేస్తున్నారు.

గీత గోవిందం, నోటా తో విజయ్ కి అక్కడ క్రేజ్ బాగా పెరిగింది. దాంతో ఈ చిత్రాన్ని అక్కడ విడుదల చేసి క్యాష్ చేసుకోవాలని నిర్మాతలు భావిస్తున్నారు. శ్రీనివాస రవీంద్ర డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, మురళి శర్మ , సురేఖ వాణి ముఖ్య పాత్రల్లో నటించారు. ఈచిత్రం యొక్క ట్రైలర్ , ఆడియో ఈ రోజు విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :