ఇంకో నాలుగు రోజులు అర్జున్ హవా కనబడాలి

Published on Dec 2, 2019 10:27 pm IST

నిఖిల్ నటించిన ‘అర్జున్ సురవరం’ చిత్రం ఎన్నో కష్టాల తర్వాత గత శుక్రవారం విడుదలైంది. మొదటిరోజే మంచి టాక్ తెచ్చుకున్న చిత్రం మూడు రోజులు మంచి వసూళ్లను రాబట్టింది. రెండవరోజు కొద్దిగా నెమ్మదించినా మూడవరోజు ఆదివారం పుంజుకుంది. ట్రేడ్ లెక్కల మేరకు తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులకు కలిపి చిత్రం రూ.3.5 కోట్లకు పైగానే షేర్ అందుకున్నట్టు తెలుస్తోంది.

ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.7 కోట్ల వరకు జరిగింది కాబట్టి సినిమా సేఫ్ జోన్లోకి వెళ్ళాలంటే ఇంకొ మూడున్నర కోటి రాబట్టల్సి ఉంది. అలా జరగాలంటే ఇంకో నాలుగు రోజులు బాక్స్ఆఫీస్ ముందు సినిమా హవా కనబడాలి. అదనపు స్క్రీన్స్ యాడ్ చేసి ఉండటం, పెద్ద సినిమాలేవీ థియేటర్లలో లేకపోవడం వలన వీక్ డేస్ కలెక్షన్లు స్టడీగానే కొనసాగే అవకాశం ఉంది. టి.సంతోష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను బి.మధు సమర్పణలో మూవీ డైనమిక్స్ ఎల్ఎల్‌పీ, ఔరా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై రాజ్ కుమార్ ఆకెళ్ల, కావ్య వేణుగోపాల్ నిర్మించారు.

సంబంధిత సమాచారం :

X
More