అర్జున్ సురవరం ఈ సారి పక్కా .. !

Published on Apr 18, 2019 5:44 pm IST

కిరాక్ పార్టీ తరువాత యంగ్ హీరో నిఖిల్ గత ఏడాది అర్జున్ సురవరం సినిమా ను మొదలుపెట్టాడు. షూటింగ్ అంత సక్రమంగానే జరిగింది అయితే విడుదలకు ముహూర్తం కుదరలేదు. ఇటీవల పలు సార్లు విడుదల తేది ని ప్రకటించి వాయిదావేశారు మేకర్స్. ఇక ఎట్టకేలకు ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. కొద్దీ రోజుల క్రితం మే 1 న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నామని పోస్టర్ ద్వారా ప్రకటించారు. ఇప్పుడు అదే తేది కి రిలీజ్ అవుతుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం యొక్క ప్రమోషన్స్ ను కూడా స్టార్ట్ చేశారు. అందులో భాగంగా నిఖిల్ , లావణ్య ప్రస్తుతం టివి ఇంటర్వ్యూ లలో పాల్గొంటున్నారు.

టి యెన్ సంతోష్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘కనితన్’ కి రీమేక్ గా తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో టైటిల్ రోల్ లో నిఖిల్ జర్నలిస్ట్ గా కనిపించనున్నాడు. సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్న ఈచిత్రాన్ని రాజ్ కుమార్ ఆకేళ్ల , కావ్య వేణుగోపాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక నిఖిల్ కెరీర్ కు ఈ సినిమా విజయం కీలకం కానుంది. మరి ఈ చిత్రం తో హిట్ కొట్టి మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :