వాళ్లకు కూడా “అర్జున్ రెడ్డి”కావాలంట…!

Published on Jun 26, 2019 3:49 pm IST

తెలుగులో ఘనవిజయం సాధించిన “అర్జున్ రెడ్డి” హిందీలో “కబీర్ సింగ్”గా విడుదలై రెట్టింపు విజయం వైపుగా దూసుకుపోతుంది. ఈ నెల21న విడుదలైన ఈ మూవీ ఇప్పటివరకు 100కోట్లకు పైగా వసూలుచేసి, షాహిద్ కపూర్ కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ వైపుగా దూసుకుపోతుంది. బాలీవుడ్ క్రిటిక్స్ ఈ మూవీపై పెదవి విరిచినా, ఆడియన్స్ మాత్రం బ్రహ్మరధం పడుతున్నారు.డైరెక్టర్ వంగా సందీప్ రెడ్డికి హిందీలో ఈ మూవీ గొప్ప ప్రారంభాన్ని ఇచ్చింది.

ఐతే ఈ మూవీ త్వరలో కన్నడలో కూడా రీమేక్ కానుంది. కన్నడ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాత ఎస్.నారాయణ్ ‘అర్జున్ రెడ్డి’ మూవీ కన్నడ రీమేక్ హక్కులను చేజిక్కించుకున్నారని సమాచారం. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకెళ్లే అవకాశం కలదు.ఇదే మూవీ స్టార్ హీరో విక్రమ్ కుమారుడు ధృవ్ హీరోగా “ఆదిత్య వర్మ” పేరుతో తమిళ్ లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

సంబంధిత సమాచారం :

X
More