సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో విషాదం !

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో విషాదం !

Published on Jun 28, 2021 9:03 AM IST

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రముఖ సినీ కళా దర్శకుడు అంగముత్తు షణ్ముఖం క్యాన్సర్‌ తో చెన్నైలో తుది శ్వాస విడిచిన దురదృష్ట సంఘటన చోటు చేసుకోవడం బాధాకరమైన విషయం. ఆయన ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో కొద్ది రోజులుగా చికిత్స తీసుకుంటునప్పటికీ ఆయన ప్రాణాలను వైద్యులు కాపాడలేయారు. ఆయన వయసు ప్రస్తుతం 60 సంవత్సరాలు. అంగముత్తు షణ్ముఖం తమిళంతో పాటు తెలుగులో అలాగే ఇతర భాషల్లో కూడా ప్రముఖ హీరోల చిత్రాలకు పనిచేశారు.

అలాగే షణ్ముఖం సినీ కళా దర్శకుల సంఘానికి అధ్యక్షుడిగా కూడా పని చేయడం విశేషం. అంగముత్తు షణ్ముఖం మృతికి తమిళ సినీ ప్రముఖులు, దక్షిణ భారత సినీ ప్రముఖులు తదితరులు సంతాపం తెలియజేశారు. ఆయన భౌతిక కాయానికి నేడు స్థానిక నుంగంబాక్కంలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ‘123తెలుగు.కామ్’ నుండి అంగముత్తు షణ్ముఖం మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తున్నాము.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు