డిజిటల్ ప్రీమియర్ కి రెడీ అయిన “ఆర్టికల్ 370”

యామి గౌతమ్, ప్రియమణి, రాజ్ అర్జున్ లు ప్రధాన పాత్రల్లో, ఆదిత్య సుహస్ జంభ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం ఆర్టికల్ 370. ఈ చిత్రం ఫిబ్రవరి 23, 2024 న థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టడం జరిగింది. అయితే లాంగ్ రన్ ను పూర్తి చేసుకొని, డిజిటల్ ప్రీమియర్ గా ఓటిటి ఆడియెన్స్ ను అలరించడానికి రెడీ అయిపోయింది.

రేపటి నుండి ఈ చిత్రం ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫారం అయిన నెట్ ఫ్లిక్స్ లో హిందీ బాషలో స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉండనుంది. 2019 లో ఫిబ్రవరి 14 వ తేదీన పుల్వామా దాడి జరిగిన తరువాత జమ్ము కాశ్మీర్ కు స్పెషల్ స్టేటస్ ను కల్పించే విధంగా ఆర్టికల్ 370 ను రద్దు చేసే అంశం పై సినిమా తెరకెక్కింది. జియో స్టూడియోస్ మరియు B62 స్టూడియోస్ బ్యానర్ల పై నిర్మించిన ఈ చిత్రం లో స్కంద్ సంజీవ్ ఠాకూర్, వైభవ్ తత్వవాడి, అరుణ్ గోవిల్, కిరణ్ కర్మాకర్ లు కీలక పాత్రల్లో నటించారు. డిజిటల్ ప్రీమియర్ గా ఈ చిత్రం ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

Exit mobile version