పెళ్లి చేసుకున్న ‘నాటకం’ హీరో !

Published on Jun 4, 2021 11:05 pm IST

‘నాటకం’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నటుడు ఆశిష్‌ గాంధీ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. నిఖిత అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ను ఆయన పెళ్లి చేసుకున్నారు. విభిన్నమైన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఆశిష్‌ గాంధీ నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. ఐతే తన పెళ్ళికి కొవిడ్‌-19 నిబంధనల కారణంగా అతి తక్కువ మంది కుటుంబసభ్యులు, బంధువులనే ఆహ్వానించారు.

ఇక వీరి వివాహం వేడుక హైదరాబాద్‌ లో ఘనంగా జరిగింది. కాగా, తాజాగా వీరి వివాహానికి సంబంధించిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ‘నేను కోరుకున్న లక్షణాలు ఉన్న అమ్మాయి నా లైఫ్లోకి వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా తను నా వ్యక్తితగతమైన విషయాలను బాగా అర్థం చేసుకుంటుంది’ అంటూ సిగ్గు పడుతూ ఆశిష్‌ తెలిపింది.

సంబంధిత సమాచారం :