యూ ట్యూబ్ ను షేక్ చేస్తున్న వీర రాఘవ !

యూ ట్యూబ్ ను షేక్ చేస్తున్న వీర రాఘవ !

Published on Aug 15, 2018 1:01 PM IST

ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అరవింద సమేత టీజర్ ఈ రోజు ఉదయం 9 గంటలకు విడుదలైయింది. 52 సెకండ్ల నిడివిగల ఈ టీజర్ మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ టీజర్ కు హైలైట్ గా నిలిచింది. ఇక విడదలైన 3 గంటల్లోపే ఈ టీజర్ 30లక్షల డిజిటల్ వ్యూస్ ను రాబట్టి యూ ట్యూబ్ రికార్డులను బ్రేక్ చేస్తుంది.

24 గంటల్లో ఈ టీజర్ కోటి వ్యూస్ ను సొంతం చేసుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చు. ఇక ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే కథనాయికగా నటిస్తుంది. త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో సునీల్ కమేడియన్ పాత్రలో నటిస్తున్నాడు. హారిక హాసిని క్రియేషన్స్ పతాకం ఫై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకులముందుకు రానుంది.

టీజర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు